మంచిర్యాలటౌన్: సంపూర్ణ ఆరోగ్యం ఆయుర్వేదంతోనే లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరానికి డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా ఆయుర్వేద వైద్యాధికారి నీరజ, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ రాథోడ్, ఆయుష్ వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


