● 28 నుంచి 30 వరకూ సమ్మె
● వారంలో 5 రోజులే డ్యూటీ
కల్పించాలని డిమాండ్
● వరుసగా నిలవనున్న
బ్యాంకు శాఖల సేవలు ● బ్యాంకు శాఖల్లో మాత్రమే వీలయ్యే డాక్యుమెంటేషన్, ఇతర ముఖ్యమైన లావాదేవీలు ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేసుకోవాలి.
● ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంకు యాప్‌లు, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు.
● నగదు అవసరమైన వారు ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు.
● సమ్మెకు వారాంతపు సెలవులు తోడయ్యే అవకాశం ఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలి.
● వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ వివ రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
● డిజిటల్ లావాదేవీల సమయంలో అపరిచిత లింకులు, కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
● సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం ఉంటే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలి.
ఆదిలాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో బ్యాంకు ఖాతాదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 30వరకు సమ్మె చేపట్టనున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకు యూనియన్ సభ్యులు స్ట్రైక్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. వరుస సెలవులు, సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాయి.
బ్యాంకుల సూచనలివీ..
జిల్లా రూరల్ సెమి అర్బన్ అర్బన్ మొత్తం
ఆదిలాబాద్ 54 17 38 109
ఆసిఫాబాద్ 42 15 01 58
మంచిర్యాల 51 77 04 132
నిర్మల్ 59 37 04 100
మొత్తం 206 146 47 399
ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల వివరాలు (ఎస్‌ఎల్‌బీసీ ఆధారంగా)