చెన్నూర్: పట్టణంలోని అభినవపోతన బిరుదాంకితులు వానమామలై వరదార్యులు విగ్రహాన్ని బీజేపీ 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం తొలగించడంపై కవులు, రచయితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానమామలై వరదాచార్యులు ఎమ్మెల్సీగా పని చేశారు. ఆయనను మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు ఘనంగా సన్మానించి కాలికి గండపెండేరాన్ని బహూకరించారు. సంఘటన స్థలాన్ని సీఐ బన్సీలాల్, కౌన్సిలర్లు అంబటి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, సాహీర్, కాంగ్రెస్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, రాజేశ్, సంతోశ్, బ్రహ్మయ్య, లింగంపల్లి మహేశ్, తనులు రవికుమార్, చింతల శ్రీనివాస్, పాతర్ల నాగరాజు, హిమవంతరెడ్డి పరిశీలించారు. వరదచార్యుల విగ్రహాన్ని పక్కనే ఉన్న మర్రి చెట్టు వద్ద దసరా పండుగ తర్వాత ఏర్పాటు చేస్తానని విగ్రహ కమిటీ, వారి కుటుంబ సభ్యులు, కుల సంఘాల నాయకులకు చెప్పానని కౌన్సిలర్ ఏతం శివకృష్ణ తెలిపారు. ఆ తర్వాతే విగ్రహాన్ని జగన్నాథాలయ రథం గదిలో భద్రపర్చానని తెలిపారు. కాగా, మున్సిపల్ అధికా రుల అనుమతి లేకుండా విగ్రహాన్ని తొలగించడాన్ని సంఘ విద్రోహ చర్యగా పరిగణించి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకుడు సుద్దపల్లి సుశీల్‌కుమార్ డిమాండ్ చేశారు.
మా టీచర్ మాకే కావాలని ఆందోళన
తాండూర్: మండలంలోని నర్సాపూర్ గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని డి ప్యూటేషన్‌పై వేరే చోటికి పంపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్య క్తం చేశారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించగా, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండగా ము గ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఉపాధ్యాయురాలు జ్యోతిని డిప్యూటేషన్‌పై బెల్లంపల్లికి పంపించారు. దీంతో బోధన అరకొరగా సాగుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయురాలిని ఇక్కడే కేటాయించి మెరుగైన బోధన అందేలా చూడాలని కోరారు. ఆందోళనలో విద్యా కమిటీ చైర్మన్ కుర్సింగ భగవంత్‌రావు, స్థానికులు కుర్సింగ గణపతి, ధర్మరావు, కడెం వెంకటేష్, పేంద్రం మారుతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


