కెరమెరి: రెండో బిడ్డ కోసం ఆ తల్లి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. మొదటి బిడ్డ పుట్టిన 16 ఏళ్ల తర్వాత మళ్లీ కడుపు పండడంతో తల్లిదండ్రుల ఆనందా నికి అవధులు లేవు. పురిటి నొ ప్పులు ప్రారంభం కాగానే త మ ఇంటికి మరో బిడ్డ వస్తున్నాడనే ఆనందంతో నొప్పులు భరిస్తూ ఆ తల్లి ఆసుపత్రికి బయలుదేరింది. కానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి తన పేగుబంధాన్ని చూడకుండానే తిరిగిరాని లోకానికి చేరుకుంది. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసిబిడ్డ.. పుట్టిన రోజే అమ్మను కోల్పోయిన హృదయవిషాదకర ఘటన కెరమెరి మండలంలోని చిన్న సాకడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చిన్నసాకడ గ్రామానికి చెందిన కుర్సెంగ తానుబాయి(40) మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు కెరమెరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉ ట్నూర్.. అక్కడి నుంచి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తానుబాయి మగశిశువుకు జన్మనిచ్చిన అ నంతరం స్పృహ కోల్పోయింది. వైద్యులు రాత్రంతా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. బుధవారం ఉదయం ఆమె మృతి చెందింది.
కుటుంబంలో తీవ్ర విషాదం..
ఇంటి ఇల్లాలు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. భార్యను కోల్పోయిన భర్త ఏత్మారావు, తల్లిని కోల్పోయిన పెద్ద కుమారుడు, తల్లి ప్రేమను రుచి చూడని అప్పుడే పుట్టిన బిడ్డను చూసి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
తానుబాయికి ఇప్పటికే 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇది రెండో కాన్పు. ఆమె రక్తహీనతతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆమె శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కేవలం ఆరు గ్రాములే ఉండగా, రిమ్స్‌లో వైద్యం అందించడంతో 8 గ్రామాలకు చేరింది. కాగా రెండు రక్తనాళాలు బ్లాక్ కావడమే ఆమె మృతికి కారణంగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మృతురాలికి ఐరన్ ఇంజెక్షన్ ఎక్కించేందుకు ప్రయత్నించగా అనారోగ్యానికి గురైంది. ఎప్పటికప్పుడు వైద్యసలహాలు అందించడంతో పాటు పరీక్షలు చేయించినట్లు ఏఎన్‌ఎం శోభ, ఎంఎల్‌హెచ్‌పీ శ్యాంరావు తెలిపారు. తానుబాయి పురిటి నొప్పులతో కెరమెరి పీహెచ్‌సీకి వచ్చినప్పటి నుంచి ఆమె వెంటే ఉండి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించినట్లు పేర్కొన్నారు.
రక్తహీనతతో..


