నెన్నెల: మండల కేంద్రంలో బుధవారం కురిి సన వర్షానికి పత్తి చేనులో పిడుగుపడి తోట శ్రీనుకు చెందిన పత్తి పంట కొంతమేరకు దెబ్బతింది. పంట చేతికి వచ్చే దశలో పిడుగుపడడంతో పత్తి మొక్కలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. ఇప్పటికే సాగు పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రకృతి వైపరీత్యం రూపంలో పిడుగుపాటు తమను మరింత నష్టాల్లోకి నెట్టిందని రైతు వాపోయాడు. దెబ్బతిన్న పత్తి పంటను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు.
బొలేరో ఢీకొని ఒకరు మృతి
భీమిని: కన్నెపల్లి మండలంలోని సాలీగాం గ్రామ శివారులో బుధవారం బొలేరో వాహ నం స్కూటీని ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీ సులు, స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట్‌కు చెందిన నల్గొండ సత్యనారాయణ –లక్ష్మిలకు ఇద్దరు కుమారులు సాగర్, శ్రవణ్‌లు ఉన్నారు. వీరిలో శ్రవణ్‌కు వివాహం కాగా మూడేళ్ల బాబు ఉన్నాడు. శ్రవణ్ కుటుంబంతో ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉంటున్నాడు. బుధవారం వినా యకుని నిమజ్జనం ఉండటంలో స్వగ్రామం పెంచికల్‌పేట్‌కు స్కూటీపై బయలుదేరాడు. దహెగాం నుంచి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు.
ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య
జైపూర్: మండల కేంద్రానికి చెందిన కట్కూరి లక్ష్మి(60) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి ఇంట్లో ఉ రేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్య –లక్ష్మి దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సా గిస్తుండగా ఇద్దరు కొడుకులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. లింగయ్య 30ఏళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. భార్య లక్ష్మి అతడి ఆలనపాలన చూ సుకుంటుంది. ఆమె కూడా అనారోగ్యానికి గురి కాగా మానసిక వేధనకు గురై ఆత్మహ త్య చేసుకుంది. కొడుకులు శ్రీనివాస్, మల్లేశ్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు.


