తాండూర్: బెల్లంపల్లి డివిజన్ పరిధి లోని పలు గ్రామాల్లో చోరీలకు పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. బుధవారం తాండూర్ సర్కి ల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాండూర్, భీమిని, బెల్లంపల్లి, నెన్నె ల, తాళ్లగురిజా ల, తిర్యాణి, రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీకి పాల్పడమే కాక వ్యవసాయ భూముల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను అపహరించిన ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. తాండూర్ మండలం బోయపల్లి బోర్డుకు చెందిన బండి నీలేష్, కత్తెర్ల గ్రామానికి చెందిన దూల రాజేశం, మీసాల బిక్షపతి, దూల నవీన్, బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన ఈగం రాజేశ్, రెబ్బెన మండలం రోడ్ల పహడ్ గ్రామానికి చెందిన రెబ్బెన శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, రెండు ద్విచ క్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్‌లు, 10 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుళ్లు రాజేశ్వర్, రాము, తిరుపతిరెడ్డి, విజయ్‌కుమార్, తిరుపతిలను ఏసీపీ అభినందించి నగదు బహుమతి అందించారు. తాండూర్ సీఐ దేవయ్య, తాండూర్, భీమిని ఎస్సైలు ప్రసాద్‌రావు, కోటేశ్వర్‌లు పాల్గొన్నారు.


