నిర్మల్‌టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–14 రగ్బీ బాలబాలికల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 100 మంది బాలికలు, 120 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేశారు. జోనల్‌స్థాయి రగ్బీ పోటీలు కూడా నిర్మల్‌లోనే నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రాథోడ్ లక్ష్మణ్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు రమణారావు, టీజీపీఈటీ కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, జాయింట్ సెక్రెటరీ పోశెట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవ్, హనుమాన్లు, ముఖేష్, ప్రేమలత, గిరి తదితరులు పాల్గొన్నారు.
బాసరలో ఆయుర్వేద దినోత్సవం


