భద్రత అంతంతే..! | - | Sakshi
Sakshi News home page

భద్రత అంతంతే..!

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

● జిల్లా ఆస్పత్రిలో కానరాని ఫైర్‌ అలారం సిస్టం, ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్లు ● గాడితప్పిన ఏసీల నిర్వహణ ● పనిచేయని జనరేటర్‌

ఆసిఫాబాద్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీల నిర్వహణ అధ్వానంగా మారడంతోపాటు జనరేటర్‌, లిఫ్ట్‌ పని చేయడం లేదు. కొన్నిచోట్ల ప్రమాదకరంగా వైర్లు ఉన్నా.. సరిచేయడం లేదు. రిమ్స్‌ ఘటన నేపథ్యంలో డీఎంఈ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డుతో పాటు ఐసీయూ వార్డులను పరిశీలించారు. ముందు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

అధ్వానంగా ఏసీల నిర్వహణ

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏసీలు ఉండగా, 18 పని చేస్తున్నాయి. మరో 16 పనిచేయడం లేదు. కొన్నింటికి స్టెబ్‌లైజర్లు ఉండగా కొన్నింటికి లేవు. లేబర్‌ రూమ్‌, బ్లడ్‌ బ్యాంక్‌, ల్యాబ్‌, డయాలసిస్‌, పిల్లల వార్డులో 24 గంటలపాటు వీటిని వినియోగిస్తున్నాయి. అయినా షెడ్యూల్‌ ప్రకారం సర్వీసింగ్‌ జరగడం లేదు. చెడిపోయినప్పుడు మాత్రమే ప్రైవేట్‌ మెకానిక్‌లతో మరమ్మతులు చేయిస్తున్నారు. భవనాల వారీగా ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ మ్యాప్‌, డీబీ బాక్స్‌ వివరాలు, లోడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మ్యాప్‌ అందుబాటులో లేదు. ఒక రెగ్యులర్‌ ఎలక్ట్రీషియన్‌ పోస్టు మంజూరైనా ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కొన్నిచోట ప్రమాదకరంగా వైర్లు బయటకు కనిపిస్తున్నాయి. గ్రౌండ్‌, ఫస్ట్‌ ఫ్లోర్లలో ఫైర్‌ అలారం సిస్టం లేదు. ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్లు లేవు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సైన్‌ బోర్డులు లేవు. ఎవాక్యుయేన్‌ మ్యాప్‌ లేదు. ఓవర్‌ లోడ్‌తో తరచూ ఎంసీబీలు ట్రిప్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫైర్‌ సేఫ్టీ కోసం మాక్‌ డ్రిల్‌ ఏడాదిగా నిర్వహించకపోవడం గమనార్హం.

పనిచేయని కంప్యూటర్లు

ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం చాలామంది రోగులు ఓపీ వద్ద క్యూలైన్‌లో నిలుచున్నారు. కంప్యూటర్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సమ స్య పరిష్కారం కాకపోవడంతో మ్యానువల్‌ ఓపీ షీ ట్లు అందించారు. హాల్‌లో పేషెంట్లు నిలబడే ప్రాంతంలో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

రిమ్స్‌ ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిబ్బందికి సూచనలి చ్చాం. మెకానిక్‌ల నుంచి కొటేషన్‌ తీసుకుని జనరేటర్‌ బాగు చేయిస్తాం. లిఫ్ట్‌ మరమ్మతు కోసం ఉన్నతాధికారులకు నివేదింంచాం.

– డాక్టర్‌ కిరణ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ప్రమాదం జరిగితే ఎలా..?

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో విద్యుత్‌ భద్రత ఏర్పా ట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 1999 లో ఆస్పత్రి ప్రారంభించారు. కొత్త జనరేటర్‌ మంజూరు కాకపోవడంతో నేటికీ అప్పటి జ నరేటర్‌నే వినియోగిస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగితే మంటలు ఆర్పేందుకు ఏర్పాట్లు లేవు. జనరేటర్‌తోపాటు ప్రమాదా ల నివారణకు తగిన పరికరాలు మంజూరు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement