పుస్తక పఠనంతో ఆలోచన శక్తి మెరుగు | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో ఆలోచన శక్తి మెరుగు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

● కలెక్టర్‌ కె.హరిత

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: పుస్తక పఠనంతో ఆలోచ న శక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుందని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం జిల్లాస్థాయి పఠన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి వశిష్ట(దహెగాం) సాధించగా, ద్వితీయ బహుమతి ఐశ్వర్య(గొల్లగూడ, రెబ్బెన), తృతీయ బహుమతి సాన్వి(చిన్నరాస్పెల్లి, దహెగాం) సాధించారు. అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి విజేతలకు కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య చైర్మన్‌ అనిల్‌, రూం టు రీడ్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ చారి, క్వాలిటీ కోఆర్డినేటర్‌ శ్రీని వాస్‌, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు పర్యాటక ప్రదేశాలను గుర్తించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులు తమ మండలాల్లోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి, వాటి ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యం వివరా లను సేకరించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నా రు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు జిల్లాస్థాయి చిత్రలేఖనం, నృత్య పోటీలు నిర్వహించారు. అత్యంత విశిష్టమైన, ప్రాముఖ్యమైన పర్యాటక ప్రదేశాల వివరాలను అందించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్‌అర్బన్‌: సంక్షేమ పథకాల కోసం అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన పథకాల ద్వారా అర్హులకు అవసరమైన సహా యం అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు https://wdsc.telangana.go v.inను సంప్రదించాలని కోరారు. హైదరా బాద్‌లోని సంబంధిత కార్యాలయానికి ఈ నెల 26 సాయంత్రం 5 గంటల లోగా దరఖా స్తులు అందేలా చూడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement