కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పెద్దవాగు సమీపంలోని వినాయక నిమజ్జన ప్రాంతాన్ని కాళేశ్వరం జో న్– 1 డీఐజీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఎస్పీ నితిక పంత్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పంప్ హౌజ్ నుంచి నిమజ్జన స్థలానికి చేరుకునేందుకు రోడ్డుపై గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలన్నారు. లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. అంతకు ముందు పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐలు ప్రేమ్ కుమార్, కుమారస్వామి, ఎస్సై సందీప్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్, కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్, సిబ్బంది ఉన్నారు. అలాగే సాయంత్రం ఎస్పీ నితిక పంత్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి పెద్దవాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.


