ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవన స్థలంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారావు మాట్లాడుతూ జిల్లాస్థాయి జూనియర్, సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రెండు జట్లుగా ఎంపిక చేశామన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీ మీనారెడ్డి, ఖేలో ఇండియా కోచ్ రాకేష్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


