ఆసిఫాబాద్‌రూరల్: సింగపూర్ విద్యావిధానంలో విలువలతో కూడిన విద్యకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఎంఈవో సుభాష్, ఉపాధ్యాయురాలు లావణ్య తెలిపారు. సింగపూర్ విద్యాపర్యటనలో ఉన్న వారు సోమవా రం పలు విషయాలను అధ్యయనం చేశారు. వారు మాట్లాడుతూ సింగపూర్‌లో విద్యార్థులను కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆచరణాత్మక నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు వృత్తి విద్యాశిక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తుందని పేర్కొన్నారు.


