సమస్యల పరిష్కారంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపై దృష్టి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రధాన దృష్టి సారిస్తామని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన లావుడ్య మమత దరఖాస్తు చేసుకుంది. పింఛన్‌ మంజూరు చేయాలని జైనూర్‌ మండలం జంగాం గ్రామానికి చెందిన కొడప అనుతారావ్‌, సిర్పూర్‌(టి) మండలం పారిగాం గ్రామానికి చెందిన విశ్వనాథ్‌ వేర్వేరుగా అర్జీ అందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పొరుగు సేవల కింద ఉద్యోగావకాశం కల్పించాలని జిల్లా కేంద్రానికి చెందిన కాండ్లే కీర్తికుమార్‌ దరఖాస్తు చేసుకున్నారు. చింతలమానెపల్లి మండలం బాబాసాగర్‌కు పప్పిరే బాబాజీ తన వాటా భూమిని ఇతరులు ఆక్రమించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement