ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతోపాటు పెద్దవాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. రూట్ మ్యాప్, నిమజ్జన పాయింట్లు, ఆయా ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలించే వినాయక విగ్రహాల సంఖ్య తదితర వివరాలు పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బారికేడ్లు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, క్రేన్లు, అత్యవసర ఏర్పాట్లపై సమీక్షించారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, వాహనాల రాకపోకల నియంత్రణ, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
చట్టప్రకారం సమస్యల పరిష్కారం
ఆసిఫాబాద్‌రూరల్: ప్రజల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ నితిక పంత్ అ న్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతీ ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించాలని ఆదేశించారు.


