వాంకిడి: మండలంలోని ఇందాని జెడ్పీఎస్‌ఎస్‌లో 2025– 26లో పదో తరగతి పూర్తి చేసుకున్న బిశ్వాస్ దేబిక నగదు పురస్కారానికి ఎంపికైనట్లు హెచ్‌ఎం, ఎంఈవో శివచరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ క్రమంలో 2025– 26లో పదో తరగతి ఫలితాల్లో 560 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన బిశ్వాస్ దేబికకు హైదరాబాద్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. ఈ నెల 24న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రూ.2 లక్షల నగదు పురస్కారం అందుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థి నిని మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో చదువుకుంటోంది. డీఈవో సచ్చిదానంద చారి, ఎంఈవో శివచరణ్ కుమార్, సీఆర్పీ సందీప్, ఉపాధ్యాయులు దేబికతోపాటు తల్లిదండ్రులు బిశ్వాస్ శంకర్, స్వప్నను అభినందించారు.


