ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క అభినందన | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క అభినందన

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కెరమెరి: ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు యాత్రకు సిద్ధమైన ఆదివాసీ బిడ్డలను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అభినందించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గోందికి చెందిన మడావి కన్నిబాయి, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కాత్లె ఆనంద్‌రావు ఈ నెల 23న యాత్రకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆర్థికసాయం అందించి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కొలాం, తోటి తెగలకు చెందిన యువత ఎవరెస్ట్‌ యాత్రకు సిద్ధం కావడం అభినందనీయమని కొనియాడారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని కన్నిబాయి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement