పుస్తకాలకు చెదలు | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలకు చెదలు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

కౌటాల: మండల కేంద్రంలోని గ్రంథాలయం పంచాయతీ భవనంలో కొనసాగిస్తున్నారు. చిన్నపాటి ఒక్క గదిలోనే స్టోర్‌ రూంతో పాటు పాఠకుల కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ శాఖా గ్రంథాలయంలో 250 మంది సభ్యులు ఉన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసి వివిధ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు మండలంలో దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. మార్కెట్లోకి రకరకాల కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నా గ్రంథాలయంలో మాత్రం ఇప్పటికీ పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. వర్షాలకు పైకప్పు స్లాబు ఉరుస్తుండటంతో పుస్తకాలు తడుస్తున్నాయి. ఫ్యాన్లు, బీరువాలు సైతం చెడిపోతున్నాయి. పుస్తకాలు చెదలు పడుతున్నాయి. పాఠకులు కూర్చోవడానికి సరి పడా కుర్చీలు లేకపోవడంతో ఎక్కువ మంది వస్తే నిలబడాల్సిందే. ఉన్న రెండు, మూడు కుర్చీలు సైతం విరిగిపోయిన స్థి తిలో ఉన్నాయి. పుస్తకాలు వితరణ చేయడానికి కొందరు సుముఖంగా ఉన్నప్పటికీ వాటిని భద్రపరిచేందుకు అనువైన స్థలం లేకపోవడం గమనార్హం. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. గతేడాది రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ రియాజ్‌ కౌటాల గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన మాట ఇప్పటికీ హామీగానే మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement