ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర ఇన్‌చార్జి, జాతీయ సెక్రెటరీ బి.సుభాష్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయాన్ని ఆర్‌జీపీఆర్‌ఎస్ రాష్ట్ర చైర్మన్ రాజేంద్రప్రసాద్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణలతో కలిసి సందర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బ లోపేతం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్ని కల్లో ప్రజాప్రతినిధుల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా కోఆర్డి నేటర్ కోవ ఇందిర, డీసీసీ ఉపాధ్యక్షులు తారీఖ్, మండల అధ్యక్షుడు రాపర్తి మురళీ, నాయకులు హష్మి, విజయ, తిరుపతి, బాను తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌జీపీఆర్‌ఎస్ ప్రతినిధిని సన్మానిస్తున్న
డీసీసీ అధ్యక్షురాలు సుగుణ


