● గ్రామంలో 20 ఏళ్లుగా ఒకేచోట గణనాథుడు
దహెగాం: ప్రస్తుతం వాడవాడలా వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. చిన్న గ్రామమైనా రెండు, మూడు మండపాలు దర్శనమిస్తున్నా యి. కానీ దహెగాం మండలం మొట్లగూడలో 20 ఏళ్లుగా గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఒకే గణనాథుడిని ప్రతిష్టిస్తూ పూజలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతమైన మొట్లగూడలో వందకు పైగా కుటుంబాలు ఉంటాయి. ఇక్కడి వారంతా ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా గ్రామస్తులు ఒకేచోట మండలంలో గణనాథుడిని ప్రతిష్టిస్తున్నారు. తొమ్మి ది రోజుల పూజల అనంతరం పెద్దవాగులో నిమజ్జనం చేస్తామని గ్రామస్తులు తెలిపారు.


