తిర్యాణి అభివృద్ధికి ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

తిర్యాణి అభివృద్ధికి ఒప్పందం

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

ఆసిఫాబాద్‌: తిర్యాణి ఆకాంక్షిత మండల అభివృద్ధి కార్యక్రమాలకు సీవైడీవో సంస్థతో ఒప్పందం కుదిరినట్లు కలెక్టర్‌ కె.హరిత వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి గురువారం సీవైడీవో ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆకాంక్షిత మండల అభివృద్ధిలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందించనున్నట్లు తెలిపారు. సీవైడీవో సంస్థ ఆధ్వర్యంలో ఎంపికై న 20 గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, పోషకాహారం తదితర కీలక రంగాల్లో అవసరాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సీవైడీవో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ జాదవ్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డా.నాగేశ్వర్‌, ప్రాజెక్టు మేనేజర్‌ సాయి నితీశ్‌, నీతి ఆయోగ్‌ కోఆర్డినేటర్‌ బాలరాజు రాజారాం పాల్గొన్నారు.

‘ముసాయిదా’పై అభ్యంతరాలు తెలపాలి

ఆసిఫాబాద్‌: ముసాయిదా ఓటరు జాబితాపై అ భ్యంతరాలు, సవరణలు తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపా రు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితా ప్రదర్శించారు. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ఎన్నికల అధికా రి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జెడ్పీ కార్యాలయంలో అభ్యంతరాలు సమర్పించాలని సూచించా రు. ఈ నెల 19న ఓటరు జాబితాను ప్రదర్శిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement