సృజనాత్మకతకు ప్రతీక విశ్వకర్మ | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతకు ప్రతీక విశ్వకర్మ

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

ఆసిఫాబాద్‌: కష్టపడే తత్వం, సృజనాత్మకతకు విశ్వకర్మ ప్రతీక అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, ఎం.డేవిడ్‌, డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోయల్‌, సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ము న్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ కామ్డె అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. సాంకేతిక పరి జ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లోనే గొప్ప ని ర్మాణాలు చేసిన విశ్వకర్మ ప్రస్తుత తరానికి కూడా ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, భాగ్యలక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అద్యక్షుడు భాస్కరా చారి, కార్యదర్శి తూమోజు సురేశ్‌ చా రి, శ్రీమంతుల వేణుగోపాలాచారి, రాధాకృష్ణ చారి, సంతోష్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement