హిందీ అధ్యాపకుడికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

హిందీ అధ్యాపకుడికి డాక్టరేట్‌

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

రెబ్బెన: రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హిందీ జూనియర్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కిర్మరే సుధాకర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎం.ఎల్లా, ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం సమక్షంలో సుధాకర్‌ పట్టా స్వీకరించారు. తన పరిశోధన ప్రస్థానంలో సహకరించిన కుటుంబ సభ్యులు, గురువులు, పరిశోధన మార్గదర్శకులు, కళాశాల ప్రిన్సిపాల్‌, సహచర అధ్యాపకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement