ఆసిఫాబాద్: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి వర్క్‌షా పు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నెల రో జుల పాటు వివిధ సేవ, సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు బూత్‌స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 17న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవకు, వికసిత్ భారత్ 2047 సంకల్పానికి కృతజ్ఞతగా ప్రతీ బూత్‌లోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లలో దీపం వెలిగించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ కోట్నాక విజయ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, రాపర్తి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.


