ఆసిఫాబాద్‌అర్బన్: విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది ఫీల్డ్ ఆపరేషన్ల సమయంలో ప్రతిఒక్కరూ భద్రత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని ఆ శాఖ డీఈ సుధాకర్, ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్‌ఈ ఉత్తమ్ జాడె అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం అధికారులతో భద్రతా నియమాలు, జాగ్రత్తలపై సమీక్ష ని ర్వహించారు. ఫీల్డ్ ఆపరేషన్ల సమయంలో ప ని విధానం, సేఫ్టీ నిబంధనల గురించి వివరించారు. సమావేశంలో ఏఈలు, ఎస్‌బీఈ లు, ఆర్టిజన్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అన్‌మ్యా న్డ్ సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు.


