వ్యవసాయ క్షేత్రాలు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ క్షేత్రాలు పరిశీలన

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఐదు రోజుల శిక్షణలో భాగంగా కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్లు(సీఆర్పీలు) బుధవారం డీఏవో వెంకట్‌, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామానికి చెందిన రైతులు వెంకటేశ్వర్లు, సురేశ్‌ జీవామృతం, బీజామృతం వంటి సహజ ఎరువుల గురించి వివరించారు. అనంతరం హెచ్‌పీడీఎస్‌ పత్తి చేలు, ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు మనోహర్‌, ఏవో రామకృష్ణ, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మధు, టెక్నికల్‌ అధికారి దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement