అర్హులు ఓటు కోల్పోకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఓటు కోల్పోకుండా చర్యలు

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

దహెగాం: ఎన్నిక సంఘం నిబంధనల మేరకు సర్‌ ప్రక్రియలో అర్హులు ఓటు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. దహెగాం మండలంలో 6,432 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 2,390 మందికి మాత్రమే అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న వ్యక్తులు ధ్రువపత్రాలు అందించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బీఎల్‌వోలు సక్రమంగా పని చేయడం లేదన్నారు. పనితీరు మార్చుకుని సర్‌ ప్రక్రియ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ మునవార్‌ షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement