ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగతో కలిసి హాజరయ్యారు. ఐల మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ అణగారిన వర్గాల ప్రజల భూమి హక్కులు, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నదీం మజీద్‌, బీసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement