ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ గురువారం జిల్లాస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల నె ట్‌బాల్ ఎంపిక పోటీలు రసవత్తరంగా సాగా యి. జిల్లా నలుమూలల నుంచి 100 బాలికలు, 40 మంది బాలురు హాజరయ్యారు. సబ్ జూనియర్ విభాగంలో 24 మంది, జూనియ ర్ విభాగంలో 24 మంది బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు. కాగా, ఈ పో టీలను మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, యంగ్ ఇండియా జిల్లా అధికారి మీనారెడ్డి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, ఏడుకొండలు, రాకేశ్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


