కాగజ్‌నగర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

అసెంబ్లీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో ఆర్టీసీకి అధిక ఆదాయం సమకూరుస్తున్న కాగజ్‌నగర్‌లో ప్రత్యేక బస్‌ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బా బు డిమాండ్‌ చేశారు. దివంగత ఎమ్మెల్యే పాల్వా యి పురుషోత్తం హయాంలోనే డిపో ఏర్పాటుకు నాలుగెరాలు కేటాయించినా, 20 ఏళ్లుగా డిపో ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైందన్నారు. శా సన సభ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయ న పలు అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. 114 రోజులుగా ఎస్పీఎం కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, మిల్లులో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రమాదా లు జరుగుతున్నా యాజమాన్యం కనీస ప్రమాణా లు పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యోగ భద్ర త లేక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా 118 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో పత్తిసాగు ఎక్కువగా ఉందని, కౌటాలలో రీసెర్చ్‌ సెంటర్‌ కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలి పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement