కౌటాల: పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంక ట్ అన్నారు. కౌటాల మండలం నాగేపల్లి గ్రా మ శివారులోని పంట చేలను గురువారం ప రిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పురు గు, తెగులు, పోషక, పోషక తదితర మందులను ఎంత మోతాదులో వినియోగించాలో వి వరించారు. పలు తెగుళ్లు సోకుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచన మే రకు మందులు పిచికారీ చేయాలన్నారు. వ లంటీర్ ద్వారా పంటల వివరాలను ఈ నెల 30లోగా నమోదు చేయించుకోవాలని సూచించారు. సర్పంచ్ కావుడే బిక్కు, ఏఈవో అంజన్న, రైతులు పాల్గొన్నారు.


