ఎస్పీఎం కార్మికుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్పీఎం కార్మికుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: తమ సమస్యలపై అసెంబ్లీ గళమెత్తి పరిష్కారానికి కృషి చేయాలని సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ కూనంనేని సాంబశివరా వుకు ఎస్పీఎం కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఆదివారం వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో త మ సమస్యలు ప్రస్తావించి వెరిఫికేషన్‌ ఎ న్నికలు త్వరగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకులు కోరా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెరిఫికేషన్‌ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ 110 రోజులుగా ఎస్పీఎం గేటు ఎదుట సామూహిక నిరాహార దీక్ష చే స్తున్నా కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బా ధాకరమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చే యాలని కోరారు. కూనంనేనిని కలిసినవారి లో సీపీఐ రాష్ట్ర నాయకుడు కలవేణి శంకర్‌, మంచిర్యాల జిల్లా కార్యదర్శి దాసు, జేఏసీ నాయకులు కూశన రాజన్న, షబ్బీర్‌ హుస్సేన్‌, ఏకే సింగ్‌, కార్మికులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement