కౌటాల: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ఎ మ్మెల్సీ దండె విఠల్ అనుచిత వ్యాఖ్యలు చే యడం మానుకోవాలని బీఆర్‌ఎస్ నాయకు డు కొంగ సత్యనారాయణ సూచించారు. ఆది వారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో మాట్లాడారు. సి ర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కోనప్ప ఎనలేని కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. కోనప్ప జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్ కావుడే బిక్కు, నాయకులు మధుకర్, వసంత్‌రావు, బాపు, తిరుపతి, ప్రశాంత్, ఆనంద్, సందీప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


