కెరమెరి: మండలంలోని బొగడగూడ గ్రామానికి చెందిన ఇస్లావత్ గోపాల్ (ఏహెచ్‌ఎస్ రాంజీగూడ సీఆర్టీ) ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బాధిత కుటుంబానికి ఆదివా రం పీఆర్టీయూ టీఎస్ పక్షాన రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్ మాట్లాడా రు. గోపాల్ మరణం తీరని లోటని, ఆయన గిరిజన విద్యార్థులకు 15ఏళ్లుగా అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. భవి ష్యత్‌లో వారి కుటుంబానికి యూనియన్ ఎల్ల ప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చునార్కర్ అనిల్, నాయకులు శ్రవణ్‌కుమార్, శివప్రసాద్, తు ల్సిరాం, గోర్‌సింగ్, మోహన్, వసంత్‌రావు, సురేశ్, విజేశ్, అనిల్, సంతోష్ ఉన్నారు.


