కౌటాల: ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టా లని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. ఆదివారం మండలంలోని బోదంపల్లి, కౌటా ల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సూపర్‌వైజర్లు, బీఎల్వోలు ఫారం నింపే సమయంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాలను తహసీల్దార్ ప్రమోద్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వచ్చిన ధ్రువీకరణ పత్రాలను క్షుణంగా పరిశీలించి తప్పులకు తావులేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఆర్‌ఐ దేవేందర్, బీఎల్వోలున్నారు.


