ఆసిఫాబాద్‌రూరల్: ఆదివాసీ సాహితీవేత్త మనోహర్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలో పర్ధాన్ సేవా సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్థాన్ సేవా సమాజం ప్రముఖుడు ఉద్దవ్ మాట్లాడారు. ఆదివాసీ పర్థాన్ జీవన విధా నం, సంస్కృతి, ఆచారాలకు డాక్టర్ మనోహ ర్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలో ఆదివాసీ పర్ధాన్‌ల జీవిత విశేషాలపై బననోహర్ రాసిన పాఠ్యాంశాన్ని ప్రచురించడం ఆదివాసీ పర్ధాన్ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. పర్ధాన్ సేవా సమాజం ప్రముఖులు ప్రేమ్, జనార్దన్, పెంటయ్య, రాంచందర్, తిరుపతి తదితరులున్నారు.


