కౌటాల: ప్రజాప్రభుత్వంతోనే ప్రజల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడా రు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ను కాళేశ్వరానికి తరలించిన బీఆర్‌ఎస్‌కు ఇ క్కడి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఇటీవల సభలో సీఎం రే వంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మా జీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ ఎమ్మెల్సీ దండె విఠల్ జోలికి వస్తే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మండలాధ్యక్షులు నికాడే గంగారాం, డుబ్బుల నానయ్య, సర్పంచులు భీ మ్‌రావు, సత్తయ్య, చందు, నాయకులు ఉ మామహేశ్, నాహీం, గట్టయ్య, ఖాళీం, కిశోర్, విజయ్, బండు, వెంకన్న పాల్గొన్నారు.


