కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ కార్మికులతో కలిసి బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల అనంతరం ఏఐటీయూసీ 44 కార్మిక చట్టాలను సాధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మేలు కోసమే వ్యాపారం సులభతరం పేరుతో ఆ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా రూపొందించిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షకీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంషద్, నాయకులు శివమ్, ఆసయి, మీనాక్షి, రాజేశ్, పుష్పలత, తిరుమల, శారద తదితరులు పాల్గొన్నారు.


