● కలెక్టరేట్ ఎదుట నేడు ఉపాధ్యాయ, ఉద్యోగుల ధర్నా ● రెండో పీఆర్‌సీ వెంటనే ప్రకటించి అమలు చేయాలి. బకాయి ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలి. దీనికోసం నెలకు రూ.2000 కోట్లు విడుదల చేయాలి.
● సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి.
● 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి.
● అసంబద్ధమైన వర్క్ అడ్జస్ట్‌మెంట్ జీవో 25ను వెంటనే రద్దు చేయాలి.
● ఎంప్లాయీస్ హెల్త్ కార్డులను సక్రమంగా అమలు చేయాలి.
● సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలి.
● రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ విడుదల చేయాలి.
● ఈహెచ్‌ఎస్ సీలింగ్‌ను వెంటనే ఎత్తివేయాలి. ఈహెచ్‌ఎఫ్ పథకాన్ని బలవంతంగా కాకుండా ఉద్యోగుల ఇష్టానికి అనుగుణంగా అమలు చేసేలా మినహాయింపు కల్పించాలి.
● అర్హత ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి.
● 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు కోర్టు తీర్పుకు అనుగుణంగా ఓపీఎస్ వర్తింపజేయాలి. 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి.
● జీపీఎఫ్ సంవత్సర జమలకు సంబంధించిన లోన్లు, సరెండర్ బిల్లులను క్రమబద్ధంగా విడుదల చేయాలి. వీటితోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల 64 ప్రధాన సమస్యలను పరిష్కరించాలి.
ఆసిఫాబాద్‌రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సుదీర్ఘ పెండింగ్ సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా టీజీఈజేఏసీ నేతృత్వంలో పోరుబాట పట్టారు. హక్కుల సాధనకు ఒకే తాటిపైకి వచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నారు. ఔట్‌సో ర్సింగ్, అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులు ఆందోళనకు హాజరయ్యే అవకాశం ఉంది. మహాధర్నాకు సహకరించాలని ఇప్పటికే అదనపు కలెక్టర్, డీఎస్పీ అశోక్‌లకు ఉద్యోగ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..