కాగజ్‌నగర్‌టౌన్: మిలాద్ ఉన్ నబీ పండుగ నేపథ్యంలో బుధవారం కాగజ్‌నగర్‌లో ముస్లింలు ర్యా లీ నిర్వహించారు. పలు కాలనీల నుంచి ముందుగా రాజీవ్ గాంధీ చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి మార్కెట్ ఏరియా, అంబేడ్కర్ చౌరస్తా, లారీ చౌరస్తా మీదుగా బస్టాండ్, సర్‌సిల్క్‌కాలనీ గుండా ర్యాలీ కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాయసం, ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో సిరా, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మిఠా పంపిణీ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో సీఐ ప్రేమ్‌కుమార్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలో బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లిలు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని జామా మసీద్ నుంచి వివేకనంద చౌక్, గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌక్ ఖదీమ్ మసీద్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జామా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, నాయకులు జావిద్, సయ్యద్, నిసార్, అమర్ హుస్సేన్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.


