అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగిరిన జాతీయ జెండా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సమష్టి కృషితోనే

వేదికపై మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితిక పంత్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌

ఆసిఫాబాద్‌: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధిలో జిల్లా ముందుకుసాగుతోంద ని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ పే ర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చే స్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరే డ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, ఎం.డేవిడ్‌, డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కిష్టయ్య, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రకాశ్‌ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీ య జెండా ఎగురవేశారు. సామూహిక జాతీయ గీ తాలాపన చేశారు. జిల్లా ప్రజలకు స్వాంతంత్య్ర ది నోత్సవ శుభాకాంక్షలు తెలిపి అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసగించారు. ముందుగా దేశ స్వాతంత్య్రం కోసం జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యే యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అ మలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమెల్యేలు, వివిధ సంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలిపారు. వేడుకల్లో డీఎస్పీలు అశోక్‌, వహీదొద్దిన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డే అనిల్‌కుమార్‌, మార్కె ట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, శ్యాంనాయక్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 2.41 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.88.5 కోట్ల లబ్ధి పొందారని ముఖ్య అతిథి బండ ప్రకాశ్‌ తెలిపారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: పేదలకు వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లాలో 2025–26 సంవత్సరంలో 8,396 మంది పేదలకు వైద్య చికిత్స అందించి ఇప్పటివరకు రూ.21.99 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

ఇందిరమ్మ: ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు 8,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 4,734 గిరిజనులకు కేటాయించినట్లు తెలిపా రు. లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టగా ఇప్పటివరకు 875 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు: 2025–26 సీజన్‌లో 14,534 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం 2,851 మంది నుంచి కొనుగోలు చేసి రూ.34 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

సన్నబియ్యం: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా జిల్లాలోని 112 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, 976 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,165 ప్రభుత్వ పాఠశాలలకు సన్నబియ్యం సరఫ రా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాలోని 1,65,258 లబ్ధిదారులకు రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు.

విద్యాశాఖ: అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద జిల్లాలోని 727 ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతు ల కల్పనే ధ్యేయంగా మూత్ర శాలలు, తాగునీరు, మరమ్మతులు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు క ల్పించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం ప థకం కింద జిల్లాలోని 1,067 పాఠశాలల్లో 52,596 మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల భవనాల నిర్మాణానికి రూ.21.60 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌: ఈ పథకాల కింద ఇప్పటివరకు జిల్లాలోని 444మంది ఆడపిల్లల వివా హాలకు రూ.4.44 కోట్లు అందించామని చెప్పారు.

పంచాయతీరాజ్‌ శాఖ: జిల్లాలోని 335 గ్రామపంచాయతీలకు ఒక్కో ట్రాక్టర్‌, నీటి ట్యాంకర్‌, ట్రాలీ లు అందించి ప్రతీరోజు చెత్త సేకరించి, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

మిషన్‌ వాత్సల్య: ఈ పథకం కింద రూ.5కోట్ల మిషన్‌ వాత్సల్య నిధులతో జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఉపాధిహామీ: 335 మహిళా సమాఖ్య భవనాలకు రూ.33.50 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

రోడ్లు, భవనాలు: ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌లేన్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా రూ.148 కోట్లతో అనుసంధాన పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

వైద్యశాఖ: రూ.130 కోట్లతో 100 వైద్య విద్య సీట్ల ఇన్‌టెక్‌ సామర్థ్యంతో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రలోని ఆశ్రమ బాలికల పాఠశాల, కాగజ్‌నగర్‌ కేజీబీవీ, సిర్పూర్‌ (యు) తెలంగాణ మోడల్‌ స్కూల్‌తోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి నమూనా, ఆర్టీసీ బస్సు, 108, 104 వాహనాలు, ఫైరింజిన్‌ తదితర శకటాలను ప్రదర్శించారు. సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు.

మాట్లాడుతున్న మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌

గృహజ్యోతి/ధర్తి అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌: మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించి జిల్లాలో 84,684 కుటుంబాలకు రూ.55.53 కోట్ల రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు. ధర్తి అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ పథకం కింద జిల్లాలో 982 షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన లబ్ధిదారులకు, 738 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

సంక్షేమ శాఖలు: ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు డైట్‌ చార్జీల కింద రూ.1.76 కోట్లు, కాస్మొటిక్‌ చార్జీల కింద రూ.1.68 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 2,400 మంది విద్యార్థులకు రూ.42 లక్షలు, వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా 2,668 మంది విద్యార్థులకు రూ.2.17 కోట్ల ఉపకార వేతనాలు మంజూరు చేశామని చెప్పారు.

వ్యవసాయ శాఖ: జిల్లాలో 4,52,317 ఎకరాల్లో సాధారణ సాగు చేయగా, 3.70లక్షల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపా రు. జాతీయ వ్యవసాయ ప్రకృతి మిషన్‌ 2026–27లో భాగంగా 11 క్లస్టర్ల నుంచి రైతుకు ఎకరం చొప్పున 1,375 మందిని గుర్తించి శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించామని చెప్పారు. పీఎం కి సాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా జిల్లాలో 33,796 రైతు కుటుంబాలకు రూ.6.75 కోట్లు అందించామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.1.03 కోట్లతో 266 రకాల వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద 2025–26 వానాకాలంలో 1,33,860 మంది రైతుల ఖాతాల్లో రూ.250.30 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతు బీమా కింద 74,567 మంది రైతులను నమోదు చేసి 470 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.23.50 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement