యువత ఉన్నతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఉన్నతంగా ఎదగాలి

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

కౌటాల: గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత జీ వితంలో ఉన్నతంగా ఎదగాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదొద్దీన్‌ సూచించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ఉద్యోగ కోచింగ్‌ కోసం కౌ టాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి)లో ని యువకులకు శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాలను పరిశీలించి మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తెలిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఆయా మండలాల నుంచి 552 మంది యువతీయువకులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యా రు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సైలు సతీశ్‌, సాగర్‌, సర్తాజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు మండలంలోని వివధ గ్రామాల నుంచే కాకుండా దహెగాం, పెంచికల్‌పేట నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు పరీక్ష నిర్వహించగా 100 మార్కుల పేపర్‌ అందించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదొద్దీన్‌, సీఐ ప్రేమ్‌కుమార్‌, కుమారస్వామి పర్యవేక్షించారు. ఎస్సైలు సందీప్‌, నరేశ్‌, లక్ష్మణ్‌, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement