ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాల్లో కలెక్టర్ కె.హరిత జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించా రు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్, ఆర్డీ వో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో బాలమణి, జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.శారదాదేవి, జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్‌కుమార్ జెండా ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అహ్మద్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, చైతన్య కళాశాలలో బీజేపీ నాయకుడు అ రిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, ఆర్టీసీ డిపోలో డీఎం రాజశేఖర్ జెండా ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాగౌడ్, ఏఎంసీ కార్యాలయంలో చైర్‌పర్స న్ ఇరుకుల్ల మంగ, పొట్టి శ్రీరాములు చౌక్‌లో వాసవీక్లబ్ అధ్యక్షుడు మర్యాల ఉదయబాబు, మున్సిప ల్ కార్యాలయంలో చైర్మన్ మెంగ్రె ఆకాశ్, శిశుమందిర్‌లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీ శ్‌బాబు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 33 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. వారిని అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులది ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదొద్దీన్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
జెండాకు వందనం చేస్తున్న ఎస్పీ నితిక పంత్
జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి శారదాదేవి
స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్.. కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్టే అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్‌అహ్మద్‌తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జిల్లాలో 1,64,939 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కిష్టయ్య, తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.


