‘శ్రమ దోపిడీకి గురిచేస్తున్న ఏజెన్సీలు’ | - | Sakshi
Sakshi News home page

‘శ్రమ దోపిడీకి గురిచేస్తున్న ఏజెన్సీలు’

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: మిషన్‌ భగీరథ పథకంలోని కార్మికులను ఏజెన్సీలు శ్రమదోపిడీకి గురిచేస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రిడ్‌ కార్యాలయం ఎదుట మంగళవారం మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదని, ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రతినెలా 1న కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈఈ రాకేశ్‌ ఆధ్వర్యంలో ఏజెన్సీలతో జరిగిన చర్చల్లో పెండింగ్‌ వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కారంపై సానుకూలంగా స్పందించడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరి చిరంజీవి, రాజాగౌడ్‌, మహేశ్‌, బాలేష్‌, శివమ్‌, దుర్గాజీ, ప్రకాశ్‌, అశోక్‌, గౌతమ్‌, జంగు, రవీందర్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement