కెరమెరి: సంఘటన్ సృజన అభియాన్‌తో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి మరింత బలో పేతం అవుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో మంగళవారం ని యోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌తో కలిసి మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించా రు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి రాథోడ్ శంకర్, నాయకులు సిడాం జగన్నాథ్‌రావు, సాజిద్, ప్రకాశ్, రాజయ్య, దేవిదాస్, విశ్వనా థ్, హన్మంతు, నగేశ్, జలపతి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.


