రెబ్బెన: రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చూపిన సింగరేణి ఉన్నత పాఠశా ల విద్యార్థినులను మంగళవారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీరమేశ్ ప్రత్యేకంగా అభినందించారు. సింగరేణి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్.రిషిత, పి.సిరి, సీహెచ్ లక్ష్మిదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపి వెండి పతకాలు సాధించిన విష యం తెలిసిందే. క్రీడాకారులను జీఎం ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడానైపుణాలను మెరుగుపర్చుకుంటూ జా తీయ స్థాయిలోనూ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, పాఠశాల కరస్పాండెంట్, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు, ప్రధానోపాధ్యాయుడు రవితేజ, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


