కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సర్‌సిల్క్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో విధులు నిర్తిస్తున్న ఎన్‌హెచ్‌ఎం వైద్యసిబ్బంది మంగళవారం ఆస్పత్రి తాళం వేశారు. ఆస్పత్రి మూసి ఉండటంతో పలువురు రోగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయమై ఆస్పత్రి వైద్యురాలు అప్షనాను ‘సాక్షి’ వివరణ కోరగా, ఆస్పత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో విధులు నిర్వర్తించే సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో సమ్మె చేపట్టినట్లు తెలిపారు. అయితే సిబ్బంది తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, తాళం వేశారని పేర్కొన్నారు. సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించగా సాయంత్రం ఆస్పత్రి తాళం తీయించినట్లు తెలిపారు.


