దహెగాం టాప్‌..! | - | Sakshi
Sakshi News home page

దహెగాం టాప్‌..!

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

జిల్లాలో పూర్తయిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ 95.4శాతంతో తొలిస్థానంలో దహెగాం మండలం 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల

ఆసిఫాబాద్‌: జిల్లాలో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ సోమవారం ముగిసింది. 4,55,596 ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా, ఇందులో 4,07,457 (89.4 శాతం) ఫారాలు డిజిటలైజ్‌ చేశారు. 48,139 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించలేదు. 15 మండలాల్లో దహెగాం 95.4శాతం డిజిటలైజేషన్‌తో అగ్రభాగాన నిలవగా, పెంచికల్‌పేట్‌ 95.3 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించి, సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

వీరిపై ప్రత్యేక దృష్టి

డిజిటలైజేషన్‌ పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించని ఓటర్లపై దృష్టి సారించనున్నారు. ఓటరు మృతి చెందడం, శాశ్వతంగా వలస వెళ్లడం, ఇంటికి తాళం వేసి ఉండ డం, తప్పుడు అడ్రస్‌తో పాటు వేరేచోట ఓటు ఉన్నవారిపై ఫోకస్‌ పెట్టారు. ఇందులో అత్యధికంగా వలస వెళ్లినవారు 23,766 మంది ఉండగా, మరణించిన వారు 11,334 ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైతే జాబితాలో కొనసాగించడం, లేకుంటే తొలగించనున్నారు. జిల్లాలో మొత్తం 48,139 ఫారాల డిజిటలైజేషన్‌ సాధ్యం కాలేదు. అలాగే 2002 ఓటరు జాబితాలో మ్యాపింగ్‌ కాని వా రికి అధికారులు నోటీసులు జారీ చేస్తారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించి అక్టోబర్‌ 15లోగా తిరిగి ఓటు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 19న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి కొత్త స్మార్ట్‌ రేషన్‌ కా ర్డుల పంపిణీతో పాటు అర్హులై న ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చే ప్రక్రియ చేపట్టనున్నారు.

మండలాల వారీగా డిజిటలైజేషన్‌ వివరాలు

మండలం ఓటర్లు డిజిటలైజేషన్‌ శాతం

బెజ్జూర్‌ 23640 21258 89.9

చింతలమానెపల్లి 23,025 21,755 94.05

దహెగాం 25,963 24,763 95.04

కాగజ్‌నగర్‌రూరల్‌ 44,658 40307 90.03

కాగజ్‌నగర్‌అర్బన్‌ 50,764 38,691 76.02

కౌటాల 26,753 24,951 93.3

పెంచికల్‌పేట్‌ 12,272 11,692 95.3

సిర్పూర్‌–టి 21,841 20,585 94.3

ఆసిఫాబాద్‌ 43,738 39,984 91.4

గాదిగూడ 15,460 13,943 90.2

జైనూర్‌ 24,359 20,755 85.2

కెరమెరి 23,936 21,271 88.9

లింగాపూర్‌ 10,266 8,860 86.3

నార్నూర్‌ 23,285 20,475 87.9

రెబ్బెన 28,386 26,446 93.02

సిర్పూర్‌–యు 11,872 10,638 89.6

తిర్యాణి 17,811 15,923 89.4

వాంకిడి 27,567 25,160 91.3

మొత్తం 4,55,596 4,07,457 89.4

ఎన్యూమరేషన్‌ ఫారాలు స్వీకరిస్తున్న అధికారులు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement