పెంచికల్‌పేట్: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు అట వీశాఖ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోడు పట్టాలు ఉన్నా సాగు పనులను అడ్డుకుంటున్నార ని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినా పనులు సాగనీయడం లేదని కమ్మర్‌గాం సర్పంచ్ సులోచన ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారుల పై ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తనకు 16 నెలలుగా జీతం రా వడం లేదని తెలపడంతో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పోతెపల్లి గ్రామంలో మిషన్‌భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సర్పంచ్ దుర్గం పోషన్న అధి కారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా శాఖలకు చెందిన నివేదికలను అధికారులు సభలో నివేదించారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సమావేశంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌వో అనిల్‌కుమార్, ఎస్సై అనిల్‌కుమార్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


