సిర్పూర్(టి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరమున్న పంటలు సాగు చేయాలని డీఏవో వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం రైతులు, ఏఈవోలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అత్యవసర కాంటిజెన్సీ ప్రణాళికను రైతులకు వివరించారు. వర్షాభావంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గిరీషన్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కౌటాల: ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లు ఎరువులు, విత్తనాలు, మందులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఏవో వెంకట్ అన్నారు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో డీలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు కంపెనీలకు చెందిన మందులు, ఎరువులు మాత్రమే విక్రయించాలన్నారు. సమావేశంలో ఏవో నాగరాజు, ఏఈవోలు అంజన్న, ఘాన్‌శ్యామ్, రాజేశ్వర్, సాగర్, కల్పన, రేష్మిత, కవిత తదితరులు పాల్గొన్నారు.


