హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ అరెస్ట్‌

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

జైపూర్‌: మండలంలోని ఇందారం ఫ్లైవోవర్‌ వద్ద ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై భూమేష్‌ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌ జంగిటి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బస్సు ఆసిఫాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్‌ చికి త్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు డ్రైవర్‌ రాజేశ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement